రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వయంగా దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమా ఒక భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కన్నడతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా సంచలనాత్మక విజయాన్ని సాధించి, విశేష వసూళ్లు రాబట్టింది. ఈ విజయంతోనే ‘కాంతార’ ప్రీక్వెల్ అయిన ‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1)పై మొదటి నుంచే అపారమైన అంచనాలు నెలకొన్నాయి
ఆ అంచనాలకు తగ్గట్టే అన్ని ఏరియాల్లో భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక మొదటి రోజు ఈ సినిమాకి కొన్ని కంప్లైంట్స్ తో కూడిన పాజిటివ్ టాక్ వచ్చింది.
అయినప్పటికీ దసరా హాలిడేస్ సీజన్ ను ఈ సినిమా బాగా క్యాష్ చేసుకుంది. ఆ రకంగా మొదటి వీకెండ్ అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించింది. కానీ సోమవారం కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ఒకసారి ‘కాంతార చాప్టర్ 1’ 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం 18.51 cr
సీడెడ్ 6.83 cr
ఉత్తరాంధ్ర 6.01 cr
ఈస్ట్ 2.49 cr
వెస్ట్ 1.77 cr
గుంటూరు 2.95 cr
కృష్ణా 3.02 cr
నెల్లూరు 1.33 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 42.91 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.72 cr
టోటల్ వరల్డ్ వైడ్ 43.63 కోట్లు(షేర్) (తెలుగు వెర్షన్)
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) తెలుగు వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ ఏకంగా రూ.85 కోట్లకు జరిగింది. ఈ చిత్రానికి బ్రేక్ ఈవెన్ సాధించడానికి రూ.86 కోట్ల షేర్ రాబట్టాలి. విడుదలైన 5 రోజుల్లోనే ఈ చిత్రం రూ.43.63 కోట్ల షేర్, సుమారు రూ.69 కోట్ల గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది. అంటే ఇంకా బ్రేక్ ఈవెన్ చేరుకోవడానికి రూ.42.37 కోట్ల షేర్ అవసరం ఉంది. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు మంచి స్థాయిలో ఉన్నప్పటికీ, భారీ రేట్లకు రైట్స్ కొనుగోలు చేయడం వల్ల టార్గెట్ సగం దాటక మిగిలిపోయింది. వారం మధ్యలో కూడా మంచి వసూళ్లు కొనసాగితేనే బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశం ఉంది.

Comments
Post a Comment