3rd DAY K-ర్యాంప్ కలెక్షన్స్….మాస్ రచ్చ చేస్తున్న కిరణ్ అబ్బవరం!!

 మొదటి రెండు రోజుల్లో అనుకున్న దాని కన్నా బెటర్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ K-ర్యాంప్(K-Ramp Movie) సాలిడ్ రికవరీని అందుకుంది. ఇక మూడో రోజున సినిమాకి దీపావళి పండగ హాలిడేస్ కలిసి వస్తూ ఉండగా..

ఓవరాల్ గా అన్ని చోట్లా మంచి ట్రెండ్ ను చూపెడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పండగ టైంలో ఆడియన్స్ కి మంచి ఆప్షన్ గా మారిన సినిమా ఓవరాల్ గా డే 2 తో పోల్చితే లిమిటెడ్ గానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా కొన్ని ఏరియాల్లో మంచి జోరుని చూపెడుతుంది.


దాంతో మూడో రోజు ట్లేఉగు రాష్ట్రాల్లో ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటే 1.5 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి….

సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా ఓవర్సీస్ లో ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను 3వ రోజు మండే అవ్వడంతో చూపెడుతూ ఉండటంతో..

వరల్డ్ వైడ్ గా సినిమా మూడో రోజున ఇప్పుడు 1.8-2 కోట్ల రేంజ్ లో షేర్ ని మరోసారి టార్గెట్ చేసిందని చెప్పాలి ఇప్పుడు, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఓవరాల్ గా దీపావళి వీకెండ్ లో మంచి రికవరీతో జోరు చూపెడుతున్న సినిమా..

ఇక మిగిలిన రోజుల్లో ఇదే రేంజ్ లో ట్రెండ్ ను కొనసాగిస్తే మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా 3 డేస్ కి గాను సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Comments